విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయనగరం కోట కూడలి నుంచి మయూరి కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు.
తెదేపా బైక్ ర్యాలీ..
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ విశాఖ జిల్లా ఎలమంచిలిలో.. తెలుగుదేశం శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
వైకాపా పాదయాత్ర..
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట పాదయాత్ర.. చేపట్టనున్నారు. ఐదు నియోజకవర్గాల మీదుగా 25 కిలోమీటర్ల మేర పాదయత్ర సాగుతుందని పార్టీ నేతలు తెలిపారు. ప్రధాని మోదీని కలిసి ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తామని.. వైకాపా మరో ఎంపీ మార్గాని భరత్ చెప్పారు.
సీఎం జగన్, చంద్రబాబు కలిసికట్టుగా పోరాడాలి : నారాయణ
విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు సీఎం జగన్, చంద్రబాబు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోరాడాలని సీపీఐ జాతీయ నేత నారాయణ సూచించారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటనను నారాయణ ఎద్దేవా చేశారు.
8099-981 981కు మిస్ట్ కాల్ ఇవ్వండి..
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో.. తెలుగుదేశం పార్టీ మిస్డ్‌కాల్ ఉద్యమం చేపట్టింది. 8099 981 981 నెంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి :