విశాఖ జిల్లా మన్యం కేంద్రమైన పాడేరులో ఓ కుటుంబం వరలక్ష్మీ దేవి వ్రతాన్ని వినూత్నంగా నిర్వహించింది. అమ్మవారి ప్రతిమకు మాస్క్ కట్టి వ్రతం చేశారు. ప్రపంచాన్ని కరోనా నుంచి విడిపించాలని కోరుతూ.. ఈ విధంగా చేసినట్లు కొండలరావు వివరించారు. అమ్మవారి ప్రతిమకు మాస్కు కట్టడాన్ని స్థానికులు ఆసక్తిగా గమనించారు.
ఇదీ చదవండి: ఆ రెండు బిల్లులు నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ