ETV Bharat / state

15న సికింద్రాబాద్-విశాఖ నడుమ.. వందే భారత్ పరుగులు - sankranti trains

Vande Bharat express: సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య నడవనున్న వందేభారత్‌ రైలు సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా వందే భారత్ రైలు పై రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టిన ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

vande bharat
vande bharat
author img

By

Published : Jan 12, 2023, 5:59 PM IST

Vande Bharat express: సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య నడవనున్న వందేభారత్‌ రైలు సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా రైలును ప్రారంభించనున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొంటారని అధికారులు తెలిపారు.

రాళ్లు విసిరిన ఆకతాయిలు: వందే భారత్‌ ఎక్స్‌ప్రైస్‌ రైలుపై ఆకతాయిలు రాళ్లు విసరడంతో ఓ బోగీ కిటికీ ధ్వంసమైంది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం రైలును విశాఖ రైల్వే స్టేషన్‌కు రప్పించారు. సిబ్బంది, రైల్వే అధికారులు పరిశీలించిన అనంతరం సాయంత్రం విశాఖ స్టేషన్‌ నుంచి కోచ్‌ కాంప్లెక్స్‌కు వెళ్తుండగా.. కంచరపాలెం రామ్మూర్తిపంతులు పేట వద్ద ఆకతాయిలు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో వందే భారత్‌ రైలు కిటికీ అద్దం ధ్వంసమైంది.

నిందితుల గుర్తింపు : వందే భారత్ రైలుపై రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టిన ఘటనను రైల్వే శాఖ తీవ్రంగా పరిగణించింది. అద్దాలు పగలగొట్టిన ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధ్యులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇక.. ఈ కోచ్ తీరుని పరిశీలించేందుకు వాల్టైర్ డిఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి కోచింగ్ యార్డ్ ను సందర్శించారు. రైల్వే బోర్డు నిర్ణయం ప్రకారమే ప్రారంభోత్సవం ఉంటుందని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.