ఖరారైన టిక్కెట్లున్న ప్రయాణికులనే రైల్వే స్టేషన్ లోనికి అనుమతిస్తామని విశాఖపట్టణంలోని వాల్తేరు డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. వివిధ స్టేషన్లలో తీసుకుంటున్న భద్రతా చర్యలపై ఆయన సమీక్షించారు. దసరా, దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నందున.. మరిన్ని కొవిడ్ కట్టడి జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
కరోనా సోకిన వ్యక్తులను ప్రయాణానికి అనుమతించబోమని తెలిపారు. రైల్వే పరిసరాల్లో ఉమ్మివేయడం నిషేధమని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు మీరితే.. వైద్య పరీక్షలు నిర్వహించి, జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పండుగ ప్రత్యేక రైళ్లన్నీ రిజర్వేషన్ ఉన్నవే తప్ప.. జనరల్ బోగీలు ఉండవని డీఆర్ఎం మరో మారు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అన్ని స్టేషన్లలోనూ అనౌన్స్మెంట్ రూపంలో నిరంతరాయంగా చెబుతున్నట్టు వివరించారు.
ప్రయాణీకుల అవగాహన కోసం పలు చోట్ల బ్యానర్లను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమైన రైల్వే స్టేషన్ల వద్ద.. సరిపడినన్ని టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. చివరి క్షణంలో వచ్చే ప్రయాణీకుల కోసం రిజర్వేషన్ కౌంటర్లు, యాత్రి సువిధ కేంద్రాలు అందుబాటులోకి తీసుకు వచ్చామని తెలిపారు.
ఇదీ చదవండి: