ETV Bharat / state

కొవిడ్ నిబంధనల మధ్య.. యూపీఎస్సీ పరీక్షల నిర్వహణ - విశాఖలో యూపీఎస్సీ పరీక్షల నిర్వహణ

కొవిడ్ నిబంధనల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా యూపీఎస్సీ పరీక్షలు జరిగాయి. విజయవాడ, విశాఖ, అనంతపురం జిల్లాల్ల కలెక్టర్లు వారి జిల్లాలో కేటాయించిన పరీక్ష కేంద్రాలకు వెళ్లి... పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.

upsc exams conducted under covid precautions in state
కొవిడ్ నిబంధనల మధ్య యూపీఎస్సీ పరీక్షల నిర్వహణ
author img

By

Published : Oct 4, 2020, 8:48 PM IST

విజయవాడలోని యూపీఎస్సీ పరీక్షల నిర్వహణను జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ అహ్మద్ పరిశీలించారు. నగరంలోని బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాలలో... పరీక్ష తరగతులను గమనించారు. నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.

విశాఖలో...

విశాఖలో ప్రిలిమినరీ పరీక్షలు కొవిడ్ నిబంధనల మధ్య జరిగాయి. ఈ పరీక్షలకు జిల్లాలోని 27 పరీక్షా కేంద్రాల్లో 10,796 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు, పరీక్షల నిర్వహణ సిబ్బంది సహా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కోవిడ్ నియమాలు పాటించారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, సీనియర్ ఐఏఎస్ అధికారులు, యూపీఎస్సీ పరిశీలకులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అన్ని పరీక్షా కేంద్రాలు శానిటైజ్ చేసి, తాగు నీటి సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.

అనంతపురంలో...

అనంతపురంలోని యూపీఎస్సీ పరీక్షలకు కేటాయించిన కేంద్రాలను సెంటర్ అబ్జర్వర్ కోన శశిధర్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు.

ఇదీ చదవండి:

సర్దుబాటు జరగక.. బదిలీలు కానరాక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.