విశాఖ జిల్లా దేవరాపల్లిలో ఉపాధి హామీ పథకం కూలీలకు పనులు నిలిపేశారు. దాదాపుగా 600 మంది కూలీలు పనిలేక ఇబ్బందులు పడుతున్నారు. కడుపుమండిన కూలీలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉపాధి హామీ పథకం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యాలయం వద్ద అధ్వానంగా ఉన్న మట్టి దిబ్బలను పలుగు, పార చేతపట్టి చదును చేసి నిరసన తెలిపారు.
కూలీలు పనిలేక ఇబ్బంది పడుతున్నారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న తెలిపారు. కొవిడ్ వలన ఇతర ప్రాంతాలకు వలస వెళ్లలేక ఉపాధి హామీ పనులు చేసుకుంటున్నారని చెప్పారు. స్పందించిన అధికారులు పని కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: