ETV Bharat / state

STEEL PLANT: ప్రైవేట్‌ స్టీల్‌ ప్లాంట్ల కంటే.. ప్రభుత్వానివే మెరుగు!

author img

By

Published : Jul 20, 2021, 6:08 AM IST

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ స్టీల్‌ప్లాంట్లను విక్రయించాలని చూస్తుండగా, వాటి పనితీరు ప్రైవేట్‌ కంటే మెరుగ్గా ఉన్నట్లు సోమవారం కేంద్ర ఉక్కుమంత్రి ఆర్‌సీపీ సింగ్‌ లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.

కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రి

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ స్టీల్‌ప్లాంట్లను విక్రయించాలని చూస్తుండగా, వాటి పనితీరు ప్రైవేట్‌ కంటే మెరుగ్గా ఉన్నట్లు సోమవారం కేంద్ర ఉక్కుమంత్రి ఆర్‌సీపీ సింగ్‌ లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 869 ప్రైవేటు, 9 ప్రభుత్వరంగ స్టీల్‌ప్లాంట్లు ఉన్నాయి. గత ఏడాది దేశంలోని ప్రైవేట్‌ సంస్థలన్నీ కలిపి తమకున్న 11.79 కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంలో 8.4 కోట్ల టన్నులను (71.22%) మాత్రమే ఉత్పత్తి చేస్తాయి.

ఇదే సమయంలో ప్రభుత్వరంగంలోని 9 ప్లాంట్లు కలిపి తమకున్న 2.59 టన్నుల సామర్థ్యంలో 1.95 కోట్ల టన్నులు (75.25%) ఉత్పత్తి చేసి ప్రైవేట్‌ కంటే మెరుగైన ఫలితాలు చూపాయి. ప్రభుత్వరంగంలో సెయిల్‌ ఆధ్వర్యంలో 8ప్లాంట్లతోపాటు, విశాఖస్టీల్‌ పనిచేస్తున్నాయి. వీటిని విడివిడిగా చూస్తే 2020-21లో అత్యధిక ఉత్పత్తి విశాఖ స్టీల్‌లోనే జరిగింది. దాని సామర్థ్యం 63లక్షల టన్నులు కాగా, 43.02 (68.28%) లక్షల టన్నులు ఉత్పత్తిచేసింది.

సెయిల్‌ ఉత్పత్తి సామర్థ్యం 77.49%కి పరిమితమైంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం 6 స్టీల్‌ప్లాంటను విక్రయానికి పెట్టినట్లు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ తెలిపారు. ఇందులో విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌తోపాటు నీలాంచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌, ఎన్‌ఎండీసీ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌, దుర్గాపుర్‌ అల్లాయ్‌ స్టీల్‌ప్లాంట్‌, భద్రావతిలోని విశ్వేశ్వరయ్య స్టీల్‌ప్లాంట్‌, సేలంలోని స్టీల్‌ప్లాంట్లను వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కింద విక్రయానికి పెట్టినట్లు చెప్పారు.

ప్రైవేట్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 24 ఉక్కు పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యం 23.14 లక్షల టన్నులమేర ఉండగా 15.96 లక్షల (68.97%) టన్నులు ఉత్పత్తి చేసినట్లు వెల్లడించారు. దీన్నిబట్టిచూస్తే ఏపీలోని ప్రైవేట్‌, ప్రభుత్వరంగ సంస్థల ఉత్పత్తి సామర్థ్యం ఒకేలా ఉన్నట్లు వెల్లడైంది. తెలంగాణలోని 27 ఉక్కు పరిశ్రమల సామర్థ్యం 16.05 లక్షల టన్నులు కాగా, 11.92 (74.26%) టన్నులు ఉత్పత్తి చేశాయి.

ఇదీ చదవండి:

IND vs SL: జోరు మీద టీమ్ఇండియా.. గెలుపు ఆశతో శ్రీలంక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.