ETV Bharat / state

కరోనా చూపిన మార్గం... పొలం బాట పట్టిన యువకులు

కరోనా సమయంలో ప్రజలు ఆరోగ్యం కోసం కూరగాయల బాట పట్టారు. మార్కెట్లో కూరగాయలకు పెరిగిన డిమాండ్.. కరోనా లాక్​డౌన్​తో ఉద్యోగాలు కోల్పోయిన యువకులను రైతుల్ని చేయాయి. ఆహారధాన్యాలు, వాణిజ్య పంటలకు బదులు కూరగాయల సాగు చేస్తూ ఆదాయార్జన చేస్తున్నారు. ఎక్కడో చాలీచాలని జీతాలతో చేసే ఉద్యోగాల కన్నా..ఊర్లో ఉన్న కాస్త పొలంలో కూరగాయలు పండించుకోవడం ఆనందం ఉందని యువరైతులు అంటున్నారు.

కరోనా చూపిన మార్గం...పొలం బాట పట్టిన యువకులు

author img

By

Published : Oct 10, 2020, 10:58 PM IST

సమాజంలో ఒక సమస్య మరెన్నో సాధనాలకు మార్గమని కరోనా కాలం నిరూపించింది. మార్చి నెల మూడో వారం నుంచి దేశమంతా లాక్​డౌన్ విధించారు. ఎక్కడికక్కడే అన్ని నిలిచిపోయాయి. కర్మాగారాలు మూసుకుపోయాయాయి. ఉద్యోగాలు, చిన్న చితక పనులు చేసుకునే వారికి ఉపాధి కరవైంది.

సరిగా ఈ సమయంలోనే విశాఖ జిల్లా రాంబిల్లి, పరవాడ మండలంలో వందలాది మంది యువకులు పట్టణాల్లో పనులు లేక... ఊరికి తిరిగివచ్చారు. పంటలు సాగుచేశారు. ఎప్పుడూ పండించే వరి, ఇతర వ్యవసాయ పంటలకు వచ్చే ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.

దీంతో ఒక వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. ఆహారధాన్యాలు కన్నా ఆకుకూరలు, కూరగాయాలు సాగు చేశారు. కూరగాయలకు మార్కెట్​లో డిమాండ్ పెరగడం వల్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఉద్యోగం చేస్తే వచ్చే జీతం కన్నా ఆకుకూరలు, కూరగాయలు వల్ల వచ్చే ఆదాయం ఎక్కుగా ఉందని యువరైతులు అంటున్నారు. చుట్టు పక్కల ఉండే ఫార్మా, ఇతర పరిశ్రమలో పనిచేసే యువకులు కొలువులు మాని సాగుబాట పట్టారు.

ఇదీ చదవండి:

విశ్వవిద్యాలయంలో వనం... 10 ఎకరాల్లో లక్షకు పైగా మొక్కల పెంపకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.