![uncle killed son in law at chinnamusidivada pathuru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-66-19-murder-ap10145_19032021092820_1903f_1616126300_633.jpg)
విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్నముసిడివాడ పాతూరులో ఓ మామ అల్లుడిని చంపాడు. పెయింటర్‌గా పనిచేసే కొత్తపల్లి చిన్న అనే వ్యక్తిని మామ శంకర్ హత్య చేశాడు. మద్యం మత్తులో అల్లుడితో మామ శంకర్, బావమరిది అశోక్ గొడవపడ్డారు. కొద్దిసేపటికే ఘర్షణ పెద్దదైంది.
విచక్షణ కోల్పోయిన మామ రాడ్డుతో అల్లుడి తలపై బలంగా కొట్టగా.. చిన్న అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని..కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి. తెలంగాణ: కారు, ఆటో ఢీకొని ముగ్గురు మహిళా కూలీలు మృతి