విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం సోమన్న పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎలమంచిలి నుంచి అడ్డ రోడ్డు వైపు వెళ్తున్న ఆటో ఎస్.రాయవరం మండలం పెద్ద గుమ్ములూరు నుంచి వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వస్తున్న నేతల ప్రసాద్(22) ముల్లంపాక ప్రభాస్ (18) తీవ్రంగా గాయపడ్డారు.
యువకులను విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులది ఎస్.రాయవరం మండలం పెద్ద కొండూరు గ్రామం. బలమైన గాయాలు తగలడం వల్ల యువకులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: