విశాఖలోని మధురవాడ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదానికి.. యువతి, యువకుడు బలయ్యారు. ఈరోజు తెల్లవారుజామున కొమ్మాది నుంచి ద్విచక్రవాహనంపై వస్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు పోతిన మల్లయపాలెం సీఐ రవికుమార్ తెలిపారు.
మృతులు రాంనగర్ వాసి మధు, కొమ్మాది వైఎస్సార్ కాలనీకి చెందిన ప్రేమ కుమార్‌లుగా గుర్తించినట్లు సీఐ వెల్లడించారు. అక్కడికక్కడే ఇరువురూ మరణించారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నిఘా వేశారు.. దొంగలను పట్టారు..