విశాఖ జిల్లా మాడుగుల మండలం పరిధిలో ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. జగన్న చావిడికి చెందిన పుణ్యవతి, తాటిపర్తి పంచాయతీ బిల్లలపాలెం గ్రామానికి చెందిన వివాహిత శిరీష కనిపించటం లేదన్న ఘటనలపై కేసు నమోదు చేశామని ఎస్సై రామారావు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. కుటుంబసభ్యులు నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: విద్యార్థిని చితకబాదిన పాఠశాల వాచ్మన్.. కుటుంబీకుల ఆందోళన