విశాఖ జిల్లా అరకులోయ మండలం మాదల పంచాయతీ బట్టివలస సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అరకు వేలి నుంచి గత్తపడుకు ప్రయాణిస్తున్న సమయంలో వారి ద్విచక్రవాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నందివలసకు చెందిన రాజు, గత్తపడు గ్రామానికి చెందిన లక్ష్మణరావులు మృతి చెందారు.
అరకు లోయ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మార్గంలో గతంలోనూ అనేక మంది ప్రమాదవశాత్తు మరణించినప్పటికీ.. అధికారులు హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు వంటివి ఏర్పాటు చేయడంలేదని స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు అంటున్నారు. ఇకనైనా వీటిపై శ్రద్ధచూపి విలువైన ప్రాణాలు కాపాడాలని వారు అభ్యర్థిస్తున్నారు.
ఇవీ చదవండి: