ETV Bharat / state

యూట్యూబ్​లో చూసి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు మైనర్లు - దొంగతనం వార్తలు

Two minors Arrest యూట్యూబ్​లో చూసి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు మైనర్లను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్​లైన్ గేమ్స్, జల్సాలకు అలవాటుపడి మైనర్లు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

యూట్యూబ్​లో చూసి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు మైనర్లు

author img

By

Published : Aug 20, 2022, 4:34 PM IST

Theft with youtube support: చోరీలు, దోపిడీలు, దొంగతనాలు చేసే నేరస్తులు కొత్త ఐడియాలతో తమ పని చేసుకుపోతున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా.. భారీ మొత్తంలో డబ్బులు కాజేసేందుకు పక్కా స్కెచ్‌లు వేసుకుంటున్నారు. బ్యాంకులు, ఏటీఎంలలో రెక్కీ నిర్వహించి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేరాలు చేసిన వాళ్ల గురించి చాలాసార్లు విన్నాం. కానీ విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు మైనర్లు ఆన్​లైన్ గేమ్స్, జల్సాలకు అలవాటుపడి దొంగలుగా మారారు. పోలీసులకు చిక్కకుండా చోరీ చేసేందుకు టెక్నికల్‌ ట్రిక్స్‌ని యూట్యూబ్‌ వీడియోలో చూసి యత్నించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గోపాలపట్నంకు చెందిన ఇద్దరు మైనర్లు యూట్యూబ్​లో చూసి దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకున్నారు. అవసరమైన పరికరాలు కొనుగోలు చేశారు. ఇంకేముంది రంగంలోకి దిగి పనిమెుదలు పెట్టారు. ఈనెల 15న వేపగుంటదరి నాయుడుతోటలో తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించారు. ఇళ్లంతా వెతికినా వారికి ఏమీ దొరకలేదు. కప్​బోర్డ్​లో ఓ కారు తాళం కనిపించగా.. దాన్ని తీసుకుని బయట పార్కు చేసిన కారుతో అక్కడినుంచి ఉడాయించారు. మరుసటి రోజు పనిమనిషి వచ్చి చూడగా..తాళాలు పగులగొట్టి ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని ఆమె దిల్లీలో ఉన్న యాజమానికి తెలిపింది. హుటాహుటిన ఇంటికి చేరుకున్న యాజమాని.. పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారించగా.. దొంగతనానికి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. కారుతో పాటు దొంగతనానికి ఉపయోగించిన రాడ్, స్క్రూడ్రైవర్, సుత్తి ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.