మైదాన ప్రాంతాల నుంచి ఏజెన్సీలోని సంతకు వచ్చే వ్యాపారులను గిరిజనులు అడ్డుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం అనకాపల్లి ప్రాంతాల్లో కరోనా పెరుగుతున్నందున ... దాని కట్టడికి గిరిజనులు నడుంబిగించారు. ఏజెన్సీలోని జి.మాడుగుల మండలం మద్దిగరువులో ప్రతి గురువారం సంత జరుగుతుంది. ఈ వారం నుంచి సంతలకు అనుమతి ఇవ్వడంతో వ్యాపారులు మార్కెట్కు వెళ్లారు. మైదాన ప్రాంతం నుంచి వచ్చి సంతల్లో వ్యాపారాలు చేసి మాకు కరోనా అంటించొద్దని గ్రామస్థులు... వారిని అడ్డుకున్నారు. మార్గమధ్యలోనే వాహనాల్ని ఆపేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంతలోకి రావద్దంటూ పట్టుబట్టారు. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో.. గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి. కనికరించని అధికారులు.... కాలిపోతానంటున్న వృద్ధుడు