ETV Bharat / state

ఏ చిన్న అవసరం వచ్చినా... వాగు దాటాల్సిందే!

author img

By

Published : Sep 16, 2020, 8:21 AM IST

అగ్గిపుల్ల కావాలన్నా వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగు దాటాల్సిందే. వాగు పొంగిందంటే వారి గుండె దడదడలాడాల్సిందే. ఏ చిన్న అవసరం వచ్చినా నడుము లోతు వాగులోకి దిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఇది.. విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలంలోని పలు గ్రామాల ప్రజల పరిస్థితి.

tribals problems at dumbriguda in visakhapatnam
డుంబ్రిగుడ మండలంలోని గిరిజనుల అవస్థలు

విశాఖ జిల్లా అరకు నియోజకవర్గ పరిధిలోని డుంబ్రిగుడ మండలంలోని కోసంగి, పెద్దపాడు... తదితర గ్రామాల వాసులు బాహ్య ప్రపంచానికి రావాలంటే అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాగు పొంగిందంటే వారికి ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోతున్నాయి.

ఏ అవసరం వచ్చినా ప్రాణాలు సైతం అరచేతిలో పెట్టుకుని వాగులోకి దిగాల్సిన దుస్థితి. నదిలోకి దిగితే ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయం. పాలకులు స్పందించి తమ ఇబ్బందులు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

నయనానందకరంగా "ఇండియన్ నయాగరా"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.