విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలోని జీడిపల్లిలో.. గిరిజనులు ఈరోజుకీ గడ్డ నీటినే తాగుతూ అవస్థలు పడుతున్నారు. గుక్కెడు శుభ్రమైన నీటి కోసం అల్లాడుతున్నారు. తాగునీరు కావాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిందే. అధికారులు చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారే తప్ప.. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీడిపల్లిలో సుమారు 50 గృహాలు ఉండగా.. 150కి పైగా జనాభా ఉన్నారు. గ్రావిటీ పథకంలో భాగంగా.. స్థానికుల కోసం కొద్ది రోజుల క్రితం నీటి కుండీని ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా కుళాయిలు బిగించగా.. పది కుటుంబాల వరకు మంచినీటిని పొందుతున్నారు. మిగతా వారంతా ఓటు గడ్డ నీటినే తాగుతూ.. తరచూ రోగాలకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తమ సమస్యపై దృష్టి సారించాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: