ETV Bharat / state

వైద్యం వికటించి గిరిజన మహిళ మృతి - trible woman dead latest news update

వైద్యం వికటించి గిరిజన మహిళ మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ప్రైవేట్​ ఆసుపత్రిలో వివాదానికి కారణమైంది. మృతురాలి భర్త కొయ్యూరు మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందిందని మృతురాలి బంధువులు, ఉద్యోగులు వైద్యశాల ఎదుట ఆందోళనకు దిగారు.

Tribal woman dead after surgery
వైద్యం వికటించి గిరిజన మహిళ మృతి
author img

By

Published : May 28, 2020, 10:16 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్​లో శస్త్ర చికిత్స వికటించి గిరిజన మహిళ మృతి చెందింది. గిరిజనులు, గిరిజన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గిరిజన ప్రాంతమైన కొయ్యూరు మండలానికి చెందిన లావ రాజు అనే ఉపాధ్యాయుడు తన భార్య మల్లేశ్వరిని స్త్రీలకు సంబంధించిన వ్యాధి శస్త్ర చికిత్స నిమిత్తం నర్సీపట్నంలోని ప్రైవేటు నర్సింగ్ హోమ్​లో జాయిన్ చేశాడు.

శస్త్ర చికిత్సకు ముందు హిమోగ్లోబిన్ 11 పాయింట్లు ఉండటం వల్ల ఆపరేషన్ కు డాక్టర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మల్లేశ్వరి మృతి చెందింది. మృతురాలి భర్త రాజు ఇతర గిరిజన సంఘం ఉద్యోగులు.. వైద్యుని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు అరకు పార్లమెంట్ సభ్యురాలు భర్త ప్రసాద్, వైద్యులు ఇరు వర్గాలతో చర్చించి.. వివాదానికి తెర దించారు.

ఇవీ చూడండి:

ఆ పనులతో.. సింహాచలం చిన్నబోతోందా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.