వంట గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ గిరిజనులు నిరసన చేపట్టారు. విశాఖ జిల్లా కోనాంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సిలిండర్‌పై ఏకంగా రూ.50 పెంచి ప్రజలపై ప్రభుత్వం అధిక భారం మోపిందని చీడికాడ మండలం సీపీఎం కార్యదర్శి దేముడు నాయుడు అన్నారు. దీనివల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరల తగ్గింపుకు సర్కారు చర్యలు తీసుకోవాలని..లేనిఎడల పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: విశాఖలోని రోడ్లకు ఎట్టకేలకు మరమ్మతులు
గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనుల నిరసన
విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాంలో సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన చేశారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.