ETV Bharat / state

''దరఖాస్తులు పరిశీలించకుండా.. ఎలా తిరస్కరిస్తారు?''

ట్రైకార్ రుణాలకు దరఖాస్తు చేసుకున్న గిరిజనులు విశాఖ జిల్లా గూడెం కొత్త వీధిలో.. ఆందోళనకు దిగారు. బ్యాంకు మేనేజరు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ట్రైకార్​ రుణాలు తిరస్కరించారని గిరిజనుల ఆందోళన
author img

By

Published : Nov 17, 2019, 9:44 PM IST

ట్రైకార్​ రుణాలు తిరస్కరించారని గిరిజనుల ఆందోళన

విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి ఎంపీడీవో కార్యాలయం ఎదుట గిరిజనులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం గిరిజనులకు స్వయం ఉపాధి నిమిత్తం ట్రైకార్​ రుణాలు మంజూరు చేయడానికి ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తులు చేసినవారంతా ఎంపీడీవో కార్యాలయానికి రావాలని అధికారులు ప్రకటన చేశారు. చుట్టు పక్కల పంచాయితీలకు చెందిన రెండు వేల మంది గిరిజనులు తగిన ధృవపత్రాలుతో మండల కేంద్రానికి చేరుకుని ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అయితే ఇంటర్వ్యూలు నిర్వహించాల్సిన బ్యాంకు మేనేజర్​ సకాలంలో రాలేదు. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి హడావిడిగా దరఖాస్తులను పరిశీలించి తిరస్కరించారని గిరిజనులు ఆరోపించారు. ఇదేమని అడిగితే మధ్యలోనే వెళ్లిపోయారని ఆవేదన చెందారు. అంతా కలిసి నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:

అడుగులో అడుగేసి.... రోడ్డు కోసం గిరిపుత్రుల నినాదాలు....

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.