విశాఖ మన్యం గూడెం కొత్తవీధి మండలంలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడంటూ ఓ గిరిజనుడిని హతమార్చారు. కొత్తపాలెం గ్రామానికి చెందిన కొర్రా పిల్కు గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి పోలీసులు ముందు లొంగిపోయాడు. శుక్రవారం అర్థరాత్రి సాయుధులైన సుమారు 20 మంది మావోయిస్టులు పిల్కు ఇంటిపై దాడి చేశారు. పిల్కుపై గొడ్డలితో విచాక్షణారహితంగా దాడికి పాల్పడి హత్య చేశారు. అడ్డుకోబోయిన పిల్కు భార్య మిత్తుపైనా దాడి చేయగా..ఆమె తీవ్రంగా గాయపడింది.
పోలీసులకు ఇన్ఫార్మర్గా పని చేస్తున్నందుకే పిల్కును హతమార్చామని ఘటనాస్థలంలో మావోయిస్టులు లేఖను విడిచి వెళ్లారు. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న మన్యంలో మావోయిస్టులు కదలికలు పెరగటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇదీచదవండి