ETV Bharat / state

సుదీర్ఘ విరామం అనంతరం పట్టాలపై రైళ్ల పరుగులు - విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైళ్లు

అన్​లాక్ ప్రక్రియలో భాగంగా విశాఖ నుంచి ప్రయాణించే పలు రైళ్ల వివరాలను ఇటీవలే రైల్వే శాఖ ప్రకటించింది. వీటికి రిజర్వేషన్లు ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ ఎ.కే.త్రిపాఠి పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్లకు టికెట్లు... రిజర్వేషన్‌ కేంద్రాల్లో, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయని తెలిపారు. టిక్కెట్ కన్ఫార్మ్‌ అయిన వారికి మాత్రమే రైళ్లలోకి అనుమతిస్తామని చెప్పారు.

trains starts after long gap at vishakhapatnam railway station
వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ ఎ.కే.త్రిపాఠి
author img

By

Published : Sep 8, 2020, 7:42 PM IST

వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ ఎ.కే.త్రిపాఠి

విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగించే రైలు...

విశాఖపట్నం-–కోర్బా-విశాఖపట్నం (08518/8517) డైలీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌

ఈ నెల 12న విశాఖపట్నంలో ప్రతి రోజు రాత్రి 8.05 గంటలకు ఈ రైలు కోర్బాకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో కోర్బాలో ప్రతి రోజు సాయంత్రం 4.10గంటలకు ప్రారంభమవుతుంది. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, కేసింగ, టిట్లాఘడ్, కంటాబంజి, ఖరియార్‌ రోడ్, మహాసముంద్, రాయ్‌పూర్, టిల్డా నియోరా, భతపరా, బిలాస్‌పూర్, అకల్తరా, జంజ్‌గిరినైలా, చంపా స్టేషన్‌లలో ఆగుతుంది.

విశాఖ మీదుగా నడిచే రైళ్లు...

తిరుచ్చిరాపల్లి-–హౌరా-–తిరుచ్చిరాపల్లి ( 02664 / 02663) వీక్లీ స్పెషల్‌ రైలు

ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు... ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 4.20 గంటలకు తిరుచ్చిరాపల్లిలో బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో హౌరాలో ప్రతి గురు, ఆది వారాల్లో సాయంత్రం 4.10 గంటలకు ప్రారంభమవుతుంది. విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్‌ స్టేషన్‌లలో ఈ రైలు ఆగుతుంది.

గౌహతి–-బెంగళూరు కంటోన్మెంట్‌-–గౌహతి (02509 / 02510) ట్రై వీక్లి స్పెషల్‌ రైలు

ఈ నెల 13 నుంచి ప్రతి ఆది, సోమ, మంగళవారాల్లో గౌహతిలో ఉదయం 6.20గంటలకు బయల్దేరే ఈ రైలు... తిరుగు ప్రయాణంలో ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో రాత్రి 11.40 బెంగళూరు కంటోన్మెంట్ నుంచి ప్రారంభమవుతుంది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 10,601 కరోనా కేసులు, 73 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.