ETV Bharat / state

ట్రాఫిక్‌ కష్టాలు తీరేలా.. శ్రీకన్య కూడలిలో సిగ్నల్‌ లైట్ల ప్రతిపాదన

author img

By

Published : Dec 31, 2020, 10:15 AM IST

ఒకవైపు లంబసింగికి పర్యాటకుల తాకిడి.. మరోవైపు సంక్రాంతి పండగ కొనుగోళ్ల జాతర.. వీటితో నర్సీపట్నంలో ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది. కొద్దిరోజులుగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రద్దీ నియంత్రించేందుకు పోలీసులు దృష్టి సారించారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదన సిద్ధం చేశారు. తాత్కాలిక కార్యాచరణ చేపట్టారు.

TRAFIC-KASTALU
TRAFIC-KASTALU

నర్సీపట్నం కొన్నేళ్లగా ట్రాఫిక్‌ వలయంలో చిక్కుకుంది. పట్టణంలో ప్రస్తుతం 65 వేలకు పైగా జనాభా ఉంది. డివిజన్‌ కేంద్రం కారణంగా నిత్యం వేల మంది వచ్చి వెళుతుంటారు. పర్యాటక ప్రాంతం లంబసింగి వెళ్లేందుకు జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో వాహనాలు నర్సీపట్నం మీదుగానే రాకపోకలు సాగిస్తాయి. నర్సీపట్నం చుట్టుపక్కల ఆరుమండలాలతో పాటు ఏజెన్సీలోని చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల ప్రజలు నర్సీపట్నం మార్కెట్‌పైనే ఆధారపడతారు. పట్టణంలో ఆటోలు, ద్విచక్ర వాహనాలు వేల సంఖ్యలో ఉండగా, బస్సులు, లారీలు, వ్యాన్లు వందల సంఖ్యలో ఉన్నాయి.

పురపాలికగా మార్పు జరిగిన ఈ తొమ్మిదేళ్లలో పట్టణం నలుచెరలా విస్తరించింది. ఇందుకు అనుగుణంగా రోడ్ల విస్తరణ లేదు. పట్టణానికి ప్రధాన రహదారి ఒక్కటే ఉంది. రాకపోకలన్నీ ఈ రోడ్డుమీదనే సాగాలి. పార్కింగ్‌ స్థలాలు లేవు. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపేస్తుంటారు. పాదచారుల కోసం దారులు లేవు. కీలకమైన శ్రీకన్య కూడలి, అబీద్‌ కూడళ్లలో సిగ్నల్‌ లైట్లు అమర్చాలని ప్రతిపాదించారు. పెదబొడ్డేపల్లి కూడలి నుంచి శ్రీకన్య కూడలి, అబీద్‌కూడలి, ఐదురోడ్ల కూడలి, ప్రభుత్వ ఆసుపత్రి వరకు ప్రధాన రహదారిపై రద్దీని నియంత్రించేందుకు నిత్యం నాలుగు బ్లూకోట్స్‌ బృందాల గస్తీని ఏర్పాటు చేశారు.

చోడవరం దాటాలంటే కష్టమే..

పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణ ఎవరికీ పట్టడంలేదు. పట్టణంలో 150 వరకు కార్లు, ఆరు వేలకు పైగా ద్విచక్ర వాహనాలు, వెయ్యి వరకు ఆటోలు నిత్యం పరుగులు తీస్తుంటాయి. లారీలు, ట్రాక్టరులు, బస్సులు సరేసరి. వీటితోపాటు గోవాడ చక్కెర కర్మాగారం గానుగాట ప్రారంభం కావడంతో చెరకు లోడ్‌తో నిత్యం వందలాది ఎడ్లబళ్లు వస్తుంటాయి. ఇక పట్టణంలో అంతర్గత రహదారులన్నీ 10 నుంచి 12 అడుగుల లోపు వెడల్పుతో ఉన్నాయి. ఇటువంటి ఇరుకు దారుల్లో ఎదురెదురుగా వాహనాలు వస్తే తప్పుకొనేందుకు కూడా వీలుండదు. ఈ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వన్‌వే ఏర్పాటు చేస్తే మంచిదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. బి-ఎన్‌ రహదారిలో గోవాడ వంతెనపై రాకపోకలు నిలిచిపోతున్నాయి.

* ట్రాఫిక్‌ ఇబ్బందులపై ఎస్సై విభీషణరావు మాట్లాడుతూ గోవాడ గానుగాట కాలంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడుతాయని గుర్తించామన్నారు. అదనంగా హోమ్‌గార్డులను ఇవ్వాలని అధికారులను కోరినట్లు పేర్కొన్నారు.

ఇలా చేస్తే మేలు...

* పట్టణానికి ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధి అత్యవసరం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని సాధుపాకల నుంచి గురంధరపాలెం, చెట్టుపల్లి మీదుగా సుబ్బారాయుడుపాలేన్ని కలుపుతూ రహదారి నిర్మాణానికి రూ. 20.81 కోట్లు కేటాయించడం తెలిసిందే. రహదారి నిర్మాణం కోసం నాలుగు గ్రామాల్లో 69.87 ఎకరాలు సేకరించారు. భూ-సేకరణకు రూ.4.30 కోట్లు రైతులకు చెల్లించారు. మిగతా నిధులతో రోడ్డు పనులు చేపట్టాల్సివుండగా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు శ్రద్ధ చూపితే ఈ రహదారి కార్యరూపం దాల్చుతుంది. తద్వారా ట్రాఫిక్‌ రద్దీ గణనీయంగా తగ్గుతుంది.

* నర్సీపట్నంలో ప్రధాన రహదారి పొడవునా ఇరువైపులా కాలువలను కలుపుతూ తారురోడ్డు విస్తరించాలని తాజాగా అధికారులు ప్రతిపాదించారు. ఇలా విస్తరిస్తే చాలాస్థలం అందుబాటులోకి వస్తుంది. వాహనాలు నిలిపేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డ్రైయినేజీలను దాటి ఆక్రమణలు చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది.

* నర్సీపట్నం వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి కొత్తవీధి మీదుగా పెదబొడ్డేపల్లిని కలుపుతూ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయించారు. రెండేళ్ల క్రితమే పనులకు శంకుస్థాపన చేసినా పనులు ముందుకు వెళ్లలేదు. ఈ పనులు పూర్తి చేస్తే ట్రాఫిక్‌ సమస్యలు ఒడ్డెక్కుతాయి.

నియంత్రణకు ప్రత్యేక చర్యలు:

రద్దీ నియంత్రణకు ఉన్న సిబ్బందినే సమర్థంగా వినియోగించుకుంటున్నాం. తాజాగా బ్లూకోట్స్‌ బృందాలకు ట్రాఫిక్‌ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాం. ఎక్కడైనా రద్దీ ఎదురైతే తక్షణం సమాచారం ఇస్తారు. సిబ్బంది స్పందించి తక్షణ చొరవ తీసుకుని సమస్య లేకుండా చూస్తారు. శ్రీకన్య కూడలి వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్‌ లైట్లు అత్యవసరమని భావిస్తున్నాం. ఇక్కడ స్తంభం వేసే అవకాశం లేనందున రోడ్డుమీదకు పైపు అమర్చి సిగ్నల్‌ లైట్స్‌ పెట్టాలన్నది ఆలోచన. - స్వామినాయుడు, పట్టణ సీఐ

ఇదీ చదవండి: విమానంలో తరలివచ్చిన శాటిలైట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.