రేపటి నుంచి విశాఖ బీచ్ రోడ్లో గణతంత్ర వేడుకల రిహార్సల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా 17 నుంచి 25వ తేదీ వరకు బీచ్ రోడ్‌కి ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని ట్రాఫిక్ జోన్ వన్ ఏసీపీ పాపారావు వెల్లడించారు.
వివరాలు
- ఉదయం 5.30 గంటలనుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ ట్రాఫిక్ క్రమబద్దీకరణ, మళ్లింపు అమలవుతుందని తెలిపారు.
- పార్క్ హోటల్ నుంచి ఆర్కే బీచ్ మీదుగా ఎన్టీఆర్ విగ్రహాం వైపు వెళ్లేవారు బీచ్ రోడ్లో పాండురంగపురం జంక్షన్ నుంచి అలిండియా రేడియో జంక్షన్ మీదుగా వెళ్లాలని నిర్దేశించారు.
- నోవాటెల్ హోటల్ నుంచి పాండురంగపురం జంక్షన్‌కి వెళ్లాల్సిన వారు ఎన్టీఆర్ విగ్రహం నుంచి అలిండియా రేడియో జంక్షన్ వైపు వెళ్లాలని పోలీసులు వివరించారు.
- బీచ్ రోడ్ లోకాకుండా సముద్రపు ఇసుకలో మాత్రమే ఉదయపు నడక వారికి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. ఆయా మార్గంలో పార్కింగ్‌కి అనుమతించడం లేదని స్పష్టం చేశారు.
- ఆర్కే బీచ్ పరిసరాల్లో నివాసముంటున్న వారు తమ రాకపోకల కోసం మూడో పట్టణ ట్రాఫిక్ సీఐ నుంచి రెసిడెన్షియల్ పాసులు విధిగా పొందాల్సి ఉంటుందని ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు.
ఇవీ చదవండి: పండుగలు జీవన గమనంలో మజిలీలు