విశాఖ మన్యం పాడేరులో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. పాడేరు మొదకొండమ్మ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. గిరిజనుల సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. ఏజెన్సీలో గిరిజన యూనివర్సిటీ, వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. 188 మహిళా సమైక్య సంఘాలకు 3.94 కోట్ల రూపాయల విలువైన చెక్కులు అందించారు. మంత్రిగా తొలిసారిగా పాడేరు వచ్చిన ఆయనకు.. ప్రజలు పెద్దఎత్తున వినతులు అందించారు. అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే.. మంత్రిని సన్మానించారు. ఏజెన్సీ సంప్రదాయంలో విస్తరాకుతో చేసిన గొడుగును మంత్రి తలపై ఉంచారు. బాణం, విల్లంబులు ఎక్కుబెట్టి గాలిలో వదిలి మంత్రి సందడి చేశారు.
ఇదీ చదవండి :