విశాఖ జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ ప్రధానోపాధ్యాయుడిపై ఇద్దరు యువకులు దాడి చేశారని వివిధ సంఘాల నేతలు ఈరోజు ఏజెన్సీ బంద్కు(protest across Visakhapatnam agency) పిలుపునిచ్చారు. వ్యాపారులు పాడేరులో దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. వేకువజాము నుంచి నిరసనకారులు బంద్కు మద్దతుగా నినాదాలు చేశారు.
పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వాహనాల అడ్డగిస్తూ ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివాసి హక్కుల నేత రామారావు దొర తో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
రెండు రోజుల కిందట లోతుగడ్డ ప్రధానోపాధ్యాయునికి నర్సీపట్నానికి చెందిన ఇద్దరు యువకులతో వాగ్వాదం అయింది. ఈ నేపథ్యంలో ఇరువురూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఉపాధ్యాయుడు గాయపడటంతో విశాఖ ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: Kodali Nani criticized Chandrababu: చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కొడాలి నాని