TIDCO Houses Beneficiaries Protest : విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని టిడ్కో గృహాల లబ్ధిదారులందరికీ ఇంటి తాళాలు ఇస్తామని చెప్పి సమావేశానికి హాజరు కావాల్సిందిగా వైసీపీ ఎమ్మెల్యే అన్నం అదీప్‌రాజ్ సమాచారమిచ్చారు. ఇళ్ల తాళాలు ఇస్తారన్న ఆశతో మహిళలంతా.. తమ పనులు మానుకుని మరీ సమావేశానికి హాజరయ్యారు. అయితే సమావేశం ప్రారంభమైన కొద్దిసేపు మాత్రమే ఎమ్మెల్యే ప్రసంగించి,.. మిగతాది తన తమ్ముడు పర్యవేక్షిస్తారని చెప్పి.. సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు మహిళలు ఆరోపిస్తున్నారు.
అయితే ఎమ్మెల్యే తమ్ముడు కూడా కొంతసేపు చూసి అక్కడినుంచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి తాళాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవటంతో మహిళలు ఆందోళనకు దిగారు. వీడియో సందేశాలు చేసి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ను వెనక్కి పిలిపించటానికి ప్రయత్నించినా.. ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఇంటి తాళాలు వస్తాయని ఎంతో ఆశతో వచ్చిన ఆ మహిళలు ఉసూరుమనుకుంటూ వెనుదిరిగారు.
ఇవీ చదవండి: