ప్రమాదవశాత్తు విశాఖ జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదం.. మూడు కుటుంబాలను రోడ్డున పడవేసింది. బుచ్చయ్యపేట మండలం మల్లాంకు చెందిన మురిగిటి పెదరాజు, చినరాజు, కల్యాణం కుటుంబాల పూరిళ్లు దగ్ధమయ్యాయి. 1.75 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది.
ఈ ఘటనలో రెండున్నర తులాల బంగారం, 45 తులాల వెండి, వ్యవసాయ భూమి దస్తావేజులు, బ్యాంక్ పుస్తకాలు కాలిపోయాయని బాధితులు తెలిపారు. రావికమతం నుంచి అగ్నిమాపక శకటం వచ్చి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవటమే కాస్త ఊరటనిచ్చింది.
ఇదీ చదవండి: