ETV Bharat / state

విషాదం... చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి - vizag district latest news updates

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని లమతపుట్ సమితి దేవగందన గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

three girls death to drop into pond in vizag district
చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి
author img

By

Published : Sep 1, 2020, 6:21 PM IST

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని లమతపుట్ సమితి దేవగందన గ్రామానికి చెందిన పూజ తమిలి, నికిత దళపతి, సంతోషిపత్రి అనే ముగ్గురు బాలికలు సోమవారం నుంచి కనిపించకుండా పోయారు. మంగళవారం గ్రామం సమీపంలోని చెరువు వద్ద బాలికల చెప్పులు కనిపించడంతో చెరువులో వెతకగా... అప్పటికే ముగ్గురూ మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న నందాపూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మృతదేహలను బయటకి తీసి, శవపరీక్ష నిర్వహించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న కొరాపూట్ శాసన సభ్యుడు రఘురాం పడల్ మృతుల కుటుంబాలను పరామర్శించారు. రెడ్ క్రాస్ తరపున రూ.పది వేలు ఆర్థిక సహాయం అందించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు విగతజీవులుగా మారటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీచదవండి.

వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు..నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.