ETV Bharat / state

విశాఖలో ముగిసిన ప్రపంచ ఆరోగ్య సదస్సు - Physician of Indian Origin news

Three days Global Health Summit: విశాఖలో మూడ్రోజులపాటు జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు ముగిసింది. ముగింపు వేడుకలో రాష్ట్ర వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు పాల్గొన్నారు. మూడ్రోజులపాటు జరిగిన ఈ సదస్సులో... గుండె వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, మహిళలకు వచ్చే సమస్యలపై ప్రముఖ వైద్యులు చర్చలు జరిపినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

Global Health Summit
Global Health Summit
author img

By

Published : Jan 8, 2023, 9:20 PM IST

మూడ్రోజులపాటు జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు ముగిసింది

Global Health Summit in Visakhapatnam: విశాఖలో మూడ్రోజులపాటు జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు ముగిసింది. ముగింపు వేడుకలో రాష్ట్ర వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు పాల్గొన్నారు. ఈ సదస్సులో అమెరికా అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మధ్య పరస్పర సహకార ఒప్పందం కుదిరింది.

విశాఖ గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌లో మూడ్రోజుల పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన వైద్య ప్రముఖులు తమ నివేదికలు పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య విధానంలో తీసుకొచ్చిన అనేక అంశాలను రాష్ట్ర వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వివరించారు. ప్రతి జిల్లాలో ఒక క్యాథ్‌ల్యాబ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విదేశీ వైద్య ప్రముఖులు రాష్టానికి వచ్చిన సమయంలో ముఖ్య ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స, అత్యవసర చికిత్సలతో పాటు సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలు అందించాలని కోరినట్లు కృష్ణబాబు చెప్పారు. నూతనంగా 17 వైద్య కళాశాలలు రాష్ట్రంలో తీసుకొస్తున్నామన్నారు. సుమారు 254కోట్ల రూపాయలతో గిరిజన ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం తలపెట్టినట్టు చెప్పారు.

ఇక్కడ వైద్యరంగంలో సేవలు అందించాలని చాలామంది ప్రవాసులు కొరుకుంటున్నారు. అందుకోసమే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఆసుపత్రుల కోసం ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. వారు అందించే సాయంతో అత్యాధునిక ఆసుపత్రులు నిర్మితమవుతున్నాయి. అలాగే వైద్యశాలలో చికిత్స, అత్యవసర చికిత్సలతో పాటు సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలు అందించాలని వారిని కోరడం జరిగింది. వారు దానికి సానుకులంగా స్పందించారు. టి.కృష్ణబాబు, రాష్ట్ర వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి

మూడ్రోజులపాటు జరిగిన ఈ సదస్సులో... గుండె వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, మహిళలకు వచ్చే సమస్యలు, అలాగే టీకాలను మరింత ప్రభావవంతంగా ప్రపంచానికి అందించే అంశంపై ప్రముఖ వైద్యులు చర్చలు జరిపినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. తుది నివేదిక సిద్ధం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామన్నారు. టి.రవిరాజు గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డును ఈ ఏడాదికి చలసాని ప్రసాద్‌కు అందించారు. సదస్సులో ప్రతిభ చూపి వివిధ విధానాలను తెలియజేసిన డాక్టర్లకు సత్కారాలు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.