సింహాచలం అప్పన్న బంగారం అమ్మకం పేరిట జరిగిన టోకరా కేసులో 38 లక్షలు మోసానికి పాల్పడినట్టుగా పోలీసులు నిర్థరించారు. దేవస్థానం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందిపై సరైన నిఘా లేనందునే ఇలాంటి మోసాలకు తావిచ్చినట్లు అవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బంగారం అమ్ముతామంటూ జరిగిన మోసంలో ముగ్గురు దేవస్థానం పొరుగు సేవల సిబ్బంది, వారి బంధువు అరెస్టు మరికొందరిలోనూ గుబులు పుట్టిస్తోంది. కోటి నలభై నాలుగు లక్షల రూపాయల మేర అప్పన్న బంగారం కోసం చెల్లించానని చెబుతున్న సూళ్లూరుపేట మహిళ ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తరహా మోసాలు పై ఇప్పుడు దేవస్థానం అంతర్గతంగా మరింత లోతుగా శోధన చేయాల్సి ఉందన్న వాదన వినిపిస్తోంది.
ఇదీ చదవండి: సింహాచలం అప్పన్న బంగారం కేసులో ముగ్గురు అరెస్టు