పోలీసులకు చిక్కిన చరవాణి దొంగ - విశాఖలో పోలీసులకు చిక్కిన దొంగ వార్తలు
రద్దీగా ఉండే ప్రదేశాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని విశాఖ కంచరపాలెం పోలీసులు పట్టుకున్నారు. కంచరపాలెం మెట్టు బజారు వద్ద ఇద్దరు యువకులు... ఓ పెద్దాయన జేబులో నుంచి చరవాణి దొంగతనం చేస్తుండగా క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఒకరు పారిపోగా... మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చరవాణి దొంగను పట్టుకున్న కంచరపాలెం పోలీసులు