లాక్డౌన్ నేపథ్యంలో విశాఖ జిల్లాలో చిక్కుకున్న సుమారు 45 మంది తెలంగాణ కూలీలకు ఎట్టకేలకు స్వాంతన లభించింది. పలువురు దాతలు ముందుకొచ్చి బియ్యంతోపాటు నిత్యావసరాలు సరఫరా చేసి ఉదారత చాటుకున్నారు. తెలంగాణలోని ములుగుకు చెందిన వలస కూలీలు నర్సీపట్నంలో జీవనం సాగిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులై వారి జీవనం స్తంభించిపోయింది. వీరి దీనస్థితిపై ఏప్రిల్ 4న 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. ముందుకొచ్చిన దాతలు వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఇదీచదవండి