రైల్వే బోర్డు ఆదేశాల మేరకు తూర్పుకోస్తా రైల్వే జోన్లోని వాల్తేరు డివిజన్ అధికారులు కరోనా నియంత్రణ చర్యలు చేపట్టారు. విశాఖపట్నంలోని డీఆర్ఎం కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు అత్యాధునిక పరికరాలతో స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచి చేతులు కడుక్కునే విధానంపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు.
లక్షకు పైగా రిజర్వేషన్ టిక్కెట్ల రద్దు
కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు ప్రయాణాలు అంటేనే భయపడుతున్నారు. ఫలితంగా చాలా రైళ్లు దాదాపు ఖాళీగా తిరగాల్సి వస్తోంది. గడిచిన ఆరు రోజులలో సుమారు లక్షకు పైగా రిజర్వేషన్ టిక్కెట్లు రద్దయ్యాయని తూర్పు కోస్తా రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
టిక్కెట్లు రద్దు వల్ల పలు ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా నిలిపి వేశారు. విశాఖ మీదుగా నడుస్తున్న 10 రైళ్లను నిలిపివేయడంతో పాటు పరిస్థితిని బట్టి మరి కొన్నింటిని రద్దు చేస్తామని తూర్పుకోస్తా రైల్వే జోన్ అధికారులు చెబుతున్నారు. ఏసీ కోచ్లలో దుప్పట్లు, కర్టెన్లను తొలగించారు. విశాఖ నుంచి బయల్దేరే ప్రతి రైలులో క్రిమిసంహారక మందులను చల్లిస్తున్నారు.
ఇదీచదవండి.