విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరి.. ఎప్పుడు కూలుతుందోనన్న ఆందోళనను పెంచుతోంది. చికిత్స కోసం వస్తున్న రోగులు భవనం తీరును చూసి ఆందోళన చెందుతున్నారు. కొద్దిపాటి వర్షం కురిస్తే స్లాబ్ పై నుంచి నీరు కారుతూ పెచ్చులూడి పడుతున్నాయని చెప్పారు. సరైన సదుపాయాలు లేక రోగులను ఇతర వైద్యశాలకు తరలిస్తున్నారని వాపోయారు. వార్డుల్లో కిటికీలు, విద్యుత్ దీపాలు సక్రమంగా లేక దోమలు బెడద ఎక్కువగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినా.. పరిష్కారం దొరకలేదని అసంతృప్తి చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చదవండి