నడిచి వెళ్తున్న మహిళా మెడలో బంగారం గొలుసుని చోరీ చేసిన ఘటన విశాఖ కంచరపాలెం రాఘవేంద్ర నగర్ వద్ద చోటు చేసుకుంది. బాపుజీ నగర్ రైతు బజార్ వద్ద నివాసముంటున్న కొయ్య వెంకటలక్ష్మి మంగళవారం ఉదయం రాఘవేంద్ర నగర్ కూడలి సేవ మార్గం మీదుగా సమీప ఆలయానికి నడచుకుంటూ వెళ్తోంది. గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె మెడలో ఆర తులం బంగారు గొలుసు తెంచుకొని పరారయ్యాడు. ఈ విషయంపై వెంకటలక్ష్మి కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్రైం ఇంచార్జ్ సీఐ అవతారం, కంచరపాలెం సీఐ కృష్ణారావు, ఎస్ఐలు అప్పల నాయుడు, సుదర్శనరావు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
ఇవీ చదవండి: పంట పొలాల్లో సిమెంట్ లారీ బోల్తా