ఎల్జీ పాలిమర్స్ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనను ఖండిస్తూ... పిటిషన్ వేసేందుకు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం హైకోర్టును గడువు కోరింది. ఈనెల 16 వరకు హైకోర్టు గడువు ఇచ్చింది. పర్యావరణ అనుమతులపై వేసిన పిల్లో... నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని కూడా జోడించాలని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో మంగళవారం ఈ కేసు పూర్తిస్థాయి విచారణకు వస్తుందని న్యాయవాది మార్కండేయ చెప్పారు.
ఇదీ చదవండి: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు: సీఎం