ETV Bharat / state

రుషికొండ తవ్వకాలపై క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేసిన కమిటీ.. ఏమందంటే!

Illegal excavations in Rushikonda: విశాఖ రుషికొండ అక్రమ తవ్వకాలపై నిజాలను నిగ్గుతేల్చేందుకు హైకోర్టు సూచనలు మేరకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ.. క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేసింది. ఈ నెల 13 నుంచి 15 వరకు తనిఖీలు చేసిన కమిటీ.. నివేదికను సిద్ధం చేస్తున్నట్లు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్ హైకోర్టుకు తెలిపారు.

Illegal excavations in Rushikonda
Illegal excavations in Rushikonda
author img

By

Published : Mar 22, 2023, 8:35 AM IST

Illegal excavations in Rushikonda: విశాఖలోని రుషికొండ మీద జరుగుతున్న అక్రమ తవ్వకాలపై నిజాలను నిగ్గుతేల్చేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో హైకోర్టు ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఈ నెల 13న క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించి 15తో ముగించిందని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎన్ హరినాథ్ హైకోర్టుకు తెలిపారు. ఆ కమిటీ ప్రస్తుతం ఓ నివేదిక సిద్ధం చేస్తోందన్నారు. దానిని కోర్డు ముందు ఉంచేందుకు కొద్ది సమయం కావాలని అన్నారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను ఏప్రిల్ 12కి వాయిదా వేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంత కుమార్ మిశ్రా, జస్టిస్ ఆర్ రమువందన్ రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవల ఈ వ్యాజ్యాలపై విచారణ చేసిన హైకోర్టు.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వీవీఎన్ఎన్ శర్మ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి శాస్త్రవేత్త డీ సౌమ్య, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైయినయిల్ కోస్టల్ మేనేజ్​మెంట్​ శాస్త్రవేత్త డాక్టర్ మానిక్ మహాపాత్ర, కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కార్యనిర్వహణ ఇంజనీర్ కమిటీ ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని గతంలో ఆదేశించింది.

హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు... విశాఖలోని రుషికొండను టూరిజం రిసార్ట్స్​ (పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్ట్) అభివృద్ధి పేరుతో విచక్షణా రహితంగా తవ్వేస్తూ పరిధికి మించి నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొంటూ విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన కార్పొరేటర్ జీవీఎల్ఎన్ మూర్తి యాదవ్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు. వీరితో పాటుగా ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేరి తన వాదనలు వినాలని ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. ఎంవోఈఎఫ్ ఏర్పాటు చేసిన కమిటీలో ఏపీ ప్రభుత్వ శాఖలకు చెందిన వారు ముగ్గురు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టారాజ్యంగా కొండను తవ్వేశారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ ఎదుర్కొంటున్నదున.. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులకు కమిటీలో స్థానం ఎలా కల్పిస్తారని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ, సంస్థలకు చెందిన అధికారులతో కమిటీ వేయాలని ఎంవోఈఎఫ్ ను ఆదేశించింది. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి స్పందిస్తూ.. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కమిటీపై అభ్యంతరం లేదన్నారు. గత కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు స్థానం కల్పించడంతో అభ్యంతరం తెలిపామని విన్నవించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.