ETV Bharat / state

చేనేతకు కేంద్రం సాయం.. రాష్ట్రానికి నిధులు విడుదల

author img

By

Published : Nov 25, 2020, 12:23 PM IST

రాష్ట్రంలోని చేనేత రంగంపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. ఎంతో మంది నేతన్నలు ఉపాధి కోల్పోయారు. ఇలా నష్టపోయిన చేనేత కార్మికుల ఉపాధి కల్పనకు కేంద్రం ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగానే డ్రెస్ కోడ్ అమలుకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు చేనేత చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను మంజూరు చేసింది.

the-central-government-has-decided-to-distribute-handloom-saris-to-anganwadi-workers
చేనేత కార్మికుల ఉపాధి కల్పనకు కేంద్రం చర్యలు

రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన చేనేత రంగం కరోనా కారణంగా ఎలాంటి ఉపాధి లేక వెలవెలబోతోంది. ఫలితంగా చేనేత కార్మికులు ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల నుంచి ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం యోచించింది. చేనేత కార్మికులను ఆదుకోవాలని సంకల్పించింది. కరోనా కాలంలో నష్టపోయిన చేనేత కార్మికుల ఉపాధి కల్పనకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే డ్రెస్ కోడ్ అమలుకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు చేనేత చీరలు ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 8.9 కోట్లు విడుదలయ్యాయి. ఈ మొత్తంతో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ఒక్కొక్కరికి రెండు చేనేత కాటన్ చీరలను సరఫరా చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించింది. సగటున ఒక్కొక్కరికి ఎనిమిది వందల రూపాయలకు మించకుండా ఖర్చు చేయాలని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 55వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పనిచేసే కార్యకర్తలు, ఆయాలు ఒక్కొక్కరికి జత చొప్పున పంపిణీకి వీలుగా రెండు లక్షల 22వేల చీరలు అవసరం కానున్నాయి. వీటి కార్యాచరణకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఆపత్కాలంలో.. మీట నొక్కండి.. ఇలా అభయం పొందండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.