TENSION AT VISAKHA AIRPORT : విశాఖ విమానాశ్రయం వద్ద కొద్దిసేపు అలజడి చోటుచేసుకుంది. విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తున్న మంత్రులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఒక్కసారిగా దూసుకొచ్చిన జనసమూహం మంత్రుల కార్లపై దాడికి దిగింది. మంత్రులు రోజా, జోగి రమేశ్ వాహనాలే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఆ వెనకే వస్తున్న వైకాపా ఉత్తరాంధ్ర సమన్వయకర్త, సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కారుపైనా దాడి చేశారు. ఈ ఊహించని దాడితో మంత్రులు కొంత కంగారుపడ్డారు.
మంత్రులపై ఆగ్రహించిన జనసైనికులు : విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్లేందుకు వైకాపా నేతలు విమానాశ్రయానికి చేరుకోగా.. అప్పుడే విశాఖ వస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు పెద్దసంఖ్యలో జనసేన శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. విశాఖ గర్జనలో పవన్‌కల్యాణ్ లక్ష్యంగా మంత్రులు విమర్శలు చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జనసేన కార్యకర్తలు.. మంత్రులు, అధికార పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అక్కడ ఉన్న గుంపులో నుంచి కొందరు వ్యక్తులు వైకాపా నేతల కార్లవైపు దూసుకొచ్చారు. మంత్రుల కార్ల బ్యానెట్లపై చేతులతో బాదారు.
ఘటనపై స్పందించిన వైకాపా మంత్రులు : తమపై దాడికి పాల్పడింది జనసేన కార్యకర్తలేనని వైకాపా నేతలు ఆరోపించారు. వారి దాడిలో కారు డ్రైవర్ గాయపడినట్లు తెలిపారు. పోలీసులు గుంపులుగా చేరిన వారిని చెదరగొట్టారు. రాళ్లదాడి ఘటనంపై విచారణ చేపట్టిన పోలీసులు.. విమానాశ్రయంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. విమానాశ్రయ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. జోగి రమేశ్ , సుబ్బారెడ్డిపై జనసైనికులు దాడి చేశారన్నారు. దీనికి పవన్ జవాబు చెప్పాలని అంబటి ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు.
-
వై వి సుబ్బారెడ్డి,జోగి రమేష్ లపై
— Ambati Rambabu (@AmbatiRambabu) October 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
విశాఖ ఎయిర్పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి!
">వై వి సుబ్బారెడ్డి,జోగి రమేష్ లపై
— Ambati Rambabu (@AmbatiRambabu) October 15, 2022
విశాఖ ఎయిర్పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి!వై వి సుబ్బారెడ్డి,జోగి రమేష్ లపై
— Ambati Rambabu (@AmbatiRambabu) October 15, 2022
విశాఖ ఎయిర్పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి!
కొత్త నాటకానికి తెరలేపిన వైకాపా : పవన్ పర్యటన నుంచి దృష్టి మళ్లించేందుకే వైకాపా కొత్త నాటకానికి తెరలేపిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. దాడి సంస్కృతిని జనసేన ఎప్పుడూ ప్రోత్సహించదని వెల్లడించారు. దాడి చేసింది జనసేన కార్యకర్తలని పోలీసులు కూడా నిర్థరించలేదన్నారు. పవన్ పర్యటనకు బందోబస్తు కల్పించాలని డీజీపీకి లేఖ రాసినా.. నామమాత్రంగానే బందోబస్తు ఏర్పాటు చేశారని విమర్శించారు.
ఇవీ చదవండి: