ETV Bharat / state

Tenders for Modernization of Harita Hotel in Visakha: వైజాగ్​లోని ఆ హోటల్​పైనే ఎందుకంత ప్రేమ.. హడావుడిగా టెండర్లు - Tourism sector in AP

Tenders for Modernization of Harita Hotel in Visakhapatnam: నిధుల కొరతతో సతమమతమవుతున్న పర్యాటకరంగ అభివృద్ధి సంస్థ ఉన్నపళంగా విశాఖలోని హరిత హోటల్‌ను 5.10 కోట్లతో ఆధునీకరించడానికి టెండర్లు పిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రిసార్ట్‌ల ఆధునీకరణ కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా పట్టించుకోని ఏపీటీడీసీ(APTDC).. సీఎంవో(CMO) ఆదేశాలతో హడావుడిగా విశాఖ హోటల్‌ మాత్రమే ఆధునికీకరణకు ముందుకొచ్చింది.

harita_hotel
harita_hotel
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2023, 10:16 AM IST

Tenders for Modernization of Harita Hotel in Visakha: ఏపీటీడీసీకి వైజాగ్​లోని ఆ హోటల్​పైనే ఎందుకంత ప్రేమ.. హడావుడిగా టెండర్లు

Tenders for Modernization of Harita Hotel in Visakhapatnam: పర్యాటక రంగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో హోటళ్లు, రిసార్ట్‌లు అధ్వానస్థితికి చేరాయి. పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా వాటిని ఆధునీకరించాలని మూడేళ్లుగా పర్యాటక అభివృద్ధి సంస్థకు ప్రతిపాదనలు పంపుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. వివిధ జిల్లాల్లో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను వదిలేసి ఒక్క విశాఖలోని హరిత హోటల్‌ను మాత్రమే ఆధునీకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tourism Development in AP ప్రపంచం రాష్ట్రంవైపు చూసే పర్యాటకం ఇదేనా..! ఆహా.. ఓహో అంతా ప్రగల్భాలేనా..! కేంద్రం ముందుకొచ్చినా..

Projects Pending for Three Years in Various Districts: రాష్ట్రంలో అనేక చోట్ల హోటళ్లు, రిసార్ట్‌ల ఆధునికీకరణ ప్రతిపాదనలు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నా విశాఖలోని హరిత హోటల్‌ ఒకటే ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థకు (Andhra Pradesh Tourism Development Corporation) గుర్తొచ్చింది. వెంటనే రూ.5.10 కోట్లతో హోటల్‌ ఆధునికీకరణ కోసం హడావిడిగా టెండర్లు పిలిచారు. వివిధ జిల్లాల్లో రూ.50 కోట్లతో దాదాపు 16 హోటళ్లు, రిసార్ట్‌ల ఆధునికీకరణకు మూడేళ్ల క్రితమే అధికారులు ప్రతిపాదించారు. తాజాగా విశాఖలోని హరిత హోటల్‌ కోసం మాత్రమే టెండర్లు పిలవడం చర్చకు దారితీసింది.

POWER CHARGES IN YSRCP RULING: వైసీపీ పాలనలో రొయ్యకు విద్యుత్ షాక్.. చార్జీల పెంపుతో అక్వారైతు విలవిల

Dilapidated Hotels and Resorts Under Auspices of Tourism: ఏపీటీడీసీకి (APTDC) చెందిన విశాఖ, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, కడపల్లో ఉన్న హోటళ్లకు, బాపట్ల జిల్లా సూర్యలంక, కోనసీమ జిల్లా దిండి, విజయవాడ భవానీ ఐలాండ్‌లోని రిసార్ట్‌లకు మంచి డిమాండు ఉంటోంది. వారాంతాల్లో ఇవి అసలు ఖాళీగా ఉండవు. గత ప్రభుత్వం అయినల టీడీపీ హయాంలో రిసార్టుల నిర్వహణ, అభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేవారు. ప్రస్తుత ప్రభుత్వం వీటిని పూర్తిగా పక్కన పెట్టింది. తుపానుతో బాగా దెబ్బతిన్న సూర్యలంక బీచ్‌ రిసార్టు (Suryalanka Beach Resort) మరమ్మతులకు గత నాలుగున్నరేళ్లలో ఒక్క రూపాయీ ఖర్చు పెట్టకపోవడం గమనార్హం. విజయవాడలోని భవానీ ద్వీపంలోని రిసార్ట్‌లదీ ఇదే పరిస్థితి.

AP sports field in neglect కొత్త స్టేడియం లేదు.. ఉన్నవాటికి రిపేర్లు లేవు! ఐపీఎల్ టీం మాత్రం తయారైపోవాలి..!

Rush Tenders for Some Works: అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉందని ఏపీటీడీసీ అధికారులు ఒక వైపున చెబుతూనే మరో వైపున ప్రభుత్వ పెద్దల ఆదేశాలు రావడమే తడవుగా కొన్ని పనులకు హడావిడిగా టెండర్లు (Tenders for Modernization of Harita Hotel) పిలుస్తున్నారు. వీటికి ప్రభుత్వం ఏమైనా నిధులిస్తుందా అంటే అలాంటిదీ ఉండదు. విశాఖ హోటల్‌ ఆధునికీకరణ పనుల కోసం ఏపీటీడీసీ సొంత నిధులు ఖర్చు చేయనుంది. నిజానికి హోటల్‌ ఆధునికీకరణ కంటే దానిని పడగొట్టి అదే స్థలంలో ఆధునిక సదుపాయాలతో కొత్త హోటల్‌ నిర్మించడం ఎంతో మేలన్న అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. పాత హోటల్‌కి రూ.5.10 కోట్లతో రంగులు వేసి ముస్తాబు చేస్తే ఉపయోగం లేదని చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.