ఇసుక డిపోను విశాఖ లోని ముడసర్లోవ వద్ద మంత్రి ముత్తంశెట్టి, జిల్లాకలెక్టర్ ప్రారంభించారు. ఇళ్ల నిర్మాణ కష్టాలను తొలగించేందుకు, తాత్కాలిక పాలసీ విధానంలో ఇసుక డిపోను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి ముత్తంశెట్టి వెల్లడించారు. కొత్త ఇసుకు పాలసీ గురుంచి కసరత్తు జరుగుతుందని వెల్లడించారు.మైనింగ్- రెవెన్యూ శాఖలు ఇసుక నిర్వహణను చూస్తాయని వివరించారు.కొత్త పాలసీ వచ్చే వరకు తాత్కాలిక పాలసీ కొనసాగుతుందని ప్రకటించారు. ఇసుక ధర విధివిధానాలు రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. వాహన యజమానుల పై కేసులు పెట్ట కుండా జిల్లా కలెక్టర్లు రెవెన్యూ యంత్రాంగం చూస్తుందని మంత్రి తెలిపారు.ఇసుకను సామాన్యులకు అందించేందుకు ఈ తాత్కాలిక ఏర్పాటు ఉపకరిస్తుందని జిల్లా కలెక్టర్ చెప్పారు.
ఇదీ చూడండి