ETV Bharat / state

Tech Mahindra CEO CP Gurnani Meet CM Jagan: సీఎం జగన్‌తో టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ భేటీ.. - Jagan To Open Vizag Infosys Office On Oct 16

Tech Mahindra CEO CP Gurnani Meet CM Jagan: ఏపీలోని విశాఖతో పాటు మరో రెండు చోట్ల స్టార్ హోటళ్ల నిర్మాణానికి టెక్ మహీంద్రా గ్రూప్ ముందుకు వచ్చింది. ఒక్కో స్టార్ హోటల్ నిర్మాణానికి 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు సీఎం జగన్​కు తెలిపారు. మరోవైపు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రముఖ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్.. విశాఖ నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

Tech_Mahindra_CEO_CP_Gurnani_Meet_CM_Jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2023, 11:45 AM IST

Tech Mahindra CEO CP Gurnani Meet CM Jagan: సీఎం జగన్‌తో టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ భేటీ

Tech Mahindra CEO CP Gurnani Meet CM Jagan : ఏపీలోని విశాఖతో పాటు మరో రెండు చోట్ల స్టార్ హోటళ్ల నిర్మాణానికి టెక్ మహీంద్రా గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసంలో టెక్ మహీంద్రా గ్రూప్ సీఈఓ సీపీ గుర్నానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. విశాఖతో పాటు మూడు చోట్ల మూడు 5 స్టార్‌, 7 స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్టు టెక్ మహీంద్రా గ్రూప్ ప్రతినిధులు సీఎం జగన్​కు వివరించారు.

Tech Mahindra to Invest 750 Crores in AP : హోటళ్ల నిర్మాణంలో 750 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఒక్కో స్టార్ హోటల్ నిర్మాణానికి 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు సీఎంకు తెలిపారు. మరోవైపు ఏపీలో పర్యాటక అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి సీఎం జగన్ వారితో చర్చించారు. వచ్చే రెండు నెలల్లోగా స్టార్ హోటళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేస్తామని టెక్ మహీంద్రా గ్రూప్ ప్రతినిధులు జగన్ మోహన్ రెడ్డికి వివరించారు.

'పరిస్థితులు బాగున్నాయ్​.. విశాఖకు భారీగా పెట్టుబడులు వస్తాయి'

ఈ నెల 16వ తేదీన ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న జగన్‌

CM Jagan Will Inaugurate Infosys Office on 16th of This Month in Vishakha : ఈ నెల 16వ తేదీ నుంచి ప్రముఖ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్.. విశాఖ నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు విశాఖ వేదికగా ఇన్ఫోసిస్ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు (Infosys Office in Vishakha) అమర్నాథ్ వెల్లడించారు. ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవ అంశాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ధ్రువీకరించినట్లు అమర్నాథ్ చెప్పారు. ప్రస్తుతం వెయ్యి మంది ఉద్యోగులతో ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. భవిష్యత్తులో 3 వేల మంది ఐటీ ఉద్యోగులకు ఉపాధి కల్పించనున్నట్లు అమర్నాథ్ తెలిపారు.

సీఎ జగన్ మోహన్ రెడ్డి ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో.. మంత్రి గుడివాడ అమర్నాథ్ గురువారం ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భవిష్యత్తులో విశాఖను ఐటీ హబ్​గా మార్చనున్నట్లు (Visakhapatnam to Change IT Hub) ఆయన పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ రాకతో మరిన్ని ఐటీ సంస్థలు విశాఖకు వచ్చే అవకాశం ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆశా భావం వ్యక్తం చేశారు.

'గ్లోబల్​ టెక్​ సదస్సు’తో విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు: మంత్రి అమర్‌నాథ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.