ETV Bharat / state

ఉపాధ్యాయుల బదిలీలో అధికార పార్టీ నాయకుల సిఫార్సులు! - ఉపాధ్యాయుల బదిలీలో సిఫార్సలు

ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేసింది. అయితే కొంత మంది అధికార పార్టీ నాయకుల సిఫార్సులతో తమకు నచ్చిన ప్రాంతాలకు బదీలి చేయించుకునేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై మిగతా ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలున్న వారంతా ఇలా సిఫార్సు బదిలీలు చేయించుకుంటే మిగతా వారి పరిస్థితి ఏంటని ఉపాధ్యాయ సంఘాల వారు కూడా ప్రశ్నిస్తున్నారు.

Teachers worry on recomondation
ఉపాధ్యాయుల బదిలీలు
author img

By

Published : Oct 18, 2020, 4:30 PM IST

టీచర్ల బదిలీ షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. సోమవారం నుంచి ఈ ప్రక్రియ మొదలు కానుంది. అయితే కొంతమంది ఉపాధ్యాయులు తాము కోరుకున్న చోటుకు బదిలీ కావటానికి అధికారపార్టీ నాయకుల సిఫార్సు లేఖలు తెచ్చుకుంటున్నారు. విశాఖ జిల్లా ఎల్లపువానిపాలెంలో ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఓ ఉపాధ్యాయుడు బదిలీలు జరిగితే దూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందని, ముందే ఉన్నతస్థాయిలో సిఫార్సు చేయించుకుని చినగదిలి ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు.

ఇటీవల పెందుర్తి మండలంలో ఇద్దరు టీచర్లు పరస్పర ఒప్పందం (మ్యూచువల్‌) పద్ధతిలో బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. మూడు రోజుల క్రితం మరో ఉపాధ్యాయుడు పరవాడ మండలం నుంచి నగర పరిధిలోకి బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నట్లు తెలిసింది. బదిలీల ప్రక్రియ మొదలయ్యే నాటికి మరికొంతమంది సిఫార్సు బదిలీలు చేయించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

అధికార పార్టీ నేతలతో ఉన్నతాధికారులకు సిఫార్సు చేయించుకుని కమిషనరేట్‌ కార్యాలయం నుంచే కొంతమంది ఉపాధ్యాయులు బదిలీలపై చక్రం తిప్పుతున్నారు. ఈ పరిణామాలపై మిగతా టీచర్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నేతల అండదండలున్న వారంతా ఇలా సిఫార్సు బదిలీలు చేయించుకుంటే మిగతా వారి పరిస్థితి ఏంటని ఉపాధ్యాయ సంఘాల వారు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రక్రియ మొదలైన తరువాత కూడా సిఫార్సు బదిలీలకు ఉత్తర్వులివ్వడాన్ని సంఘాల నేతలు తప్పుపడుతున్నారు.

ఈ విషయమై డీఈవో లింగేశ్వరరెడ్డి వద్ద ప్రస్తావించగా ఇదివరకే ఇద్దరు ఉపాధ్యాయులు బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారన్నారు. కొత్తగా ఎవరికీ బదిలీ ఉత్తర్వులు వచ్చినట్లు తెలియదని చెప్పారు. ప్రభుత్వం ఉత్తర్వుల్చిన తరువాత వారికి స్థానం చూపించాల్సిన బాధ్యత ఉందన్నారు. బదిలీల ప్రక్రియను షెడ్యూల్‌ ప్రకారం చేపడతామని అర్హులకు అన్యాయం జరగదని చెప్పారు.

ఇదీ చదవండీ...వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.