విశాఖలో ప్రేమోన్మాది దాడి వల్ల తీవ్రంగా గాయపడిన యువతి త్వరగా కోలుకోవాలని కేజీహెచ్ వద్ద తెదేపా మహిళా విభాగం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. యువతులు దాడులకు గురికావడంపై మహిళా విభాగం తీవ్ర అందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా విశాఖ పార్లమెంట్ మహిళా ఇంఛార్జి అనంతలక్ష్మి డిమాండ్ చేశారు. భద్రతా వ్యవస్థలు సమర్థంగా పని చేసేలా చూడాలని కోరారు. బాధితురాలి కుటుంబానికి తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: