ETV Bharat / state

జీవో నెంబర్​ 3పై గిరిజనుల బంద్​... తెదేపా మద్దతు

author img

By

Published : Sep 29, 2020, 4:39 AM IST

జీవో నెంబర్​ 3 రద్దుపై గిరిజనులు ఇవాళ బంద్​కు పిలుపునిచ్చారు. ఈ బంద్​కు తెదేపా మద్దతు తెలిపింది. తెదేపా శ్రేణులు బంద్​లో పాల్గొంటాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు స్పష్టం చేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్టీఆర్, చంద్రబాబు తెచ్చిన జీవో నెంబర్ 3ను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు.

జీవో నెంబర్​ 3పై గిరిజనుల బంద్​... తెదేపా మద్దతు
జీవో నెంబర్​ 3పై గిరిజనుల బంద్​... తెదేపా మద్దతు

జీవో నెంబర్ 3 రద్దుపై గిరిజనులు ఇవాళ తలపెట్టిన బంద్​కు తెదేపా మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించే వరకు గిరిజనుల తరఫున తెదేపా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులను జగన్ కాలరాస్తున్నారని మండిపడ్డారు. తెదేపా శ్రేణులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్​, చంద్రబాబులు జీవో నెంబర్ 3 తీసుకువచ్చి గిరిజనుల అభివృద్ధికి బాటలు వేశారని గుర్తుచేశారు.

వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో గిరిజనులు రాజ్యాంగబద్ధ హక్కులను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని కళా వెంకట్రావు మండిపడ్డారు. గిరిజనుల సంక్షేమానికి కేటాయించిన నిధులను దారి మళ్లిస్తున్నారని, అక్రమ మైనింగ్ కోసం అడవుల నరికివేస్తున్నారని ఆయన ఆరోపించారు. గిరిజనుల ఉనికికే ముప్పు వాటిల్లేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గిరిజన సంక్షేమం కోసం తెదేపా చేపట్టిన ఫుడ్ బాస్కెట్, గిరి కల్యాణ పత్రిక వంటి ఎన్నో సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు.

ఇదీ చదవండి : రాజధాని భూముల పరిహారంపై కృష్ణంరాజు, అశ్వనీదత్ పిటిషన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.