ETV Bharat / state

విశాఖలో పార్టీ నేతలతో అచ్చెన్నాయుడు సమావేశం - విశాఖ నేటి వార్తలు

విశాఖలో పార్టీ నేతలతో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను రేపు విడుదల చేయాలని నిర్ణయించారు. మరోవైపు అధిక సంఖ్యలో అశావహులు వినతిపత్రాలు సమర్పించారు.

tdp state president achennaidu meeting with party leaders in vizag
విశాఖలో పార్టీ నేతలతో అచ్చెన్నాయుడు సమావేశం
author img

By

Published : Feb 28, 2021, 4:53 PM IST

విశాఖ తెదేపా కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపా తరుఫున పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేయడంపై చర్చించారు. విశాఖ పరిధిలోని నియోజకవర్గ సమన్వయకర్తలతో సంప్రదించి రేపు తుది జాబితాను విడుదల చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఆశావహులు వినతి పత్రాలు సమర్పించారు. నిమ్మల రామనాయుడు, తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి, తెదేపా విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యుడు దువ్వారపు రామారావులతో అచ్చెన్నాయుడు సుదీర్ఘంగా చర్చించారు.

ఇదీచదవండి.

కాలేజ్ అమ్మాయిల్లా కనిపిస్తారు.. విరాళాల పేరుతో దండుకుంటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.