ETV Bharat / state

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ తెదేపా శ్రేణుల ర్యాలీ

author img

By

Published : Feb 11, 2021, 7:57 PM IST

మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ పాతగాజువాకలో చేపట్టిన నిరాహార దీక్ష రెండవ రోజూ కొనసాగింది. పలువురు తెదేపా నేతలు అక్కడికి చేరుకుని.. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు.

tdp leaders protests against visakha steel at gajuvaka
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ గాజువాకలో తెదేపా శ్రేణుల ర్యాలీ

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ.. విశాఖ పాత గాజువాక కూడలిలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండవ రోజుకు చేరింది. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, గణబాబు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో పాటు పలువురు తెదేపా కార్యకర్తలు ఆయనను పరామర్శించారు. ప్రభుత్వ వైద్యునితో వైద్యపరీక్షలు చేయించారు.

పాతగాజువాక కూడలిలో తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానికులు, విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ అభిమానులు, కార్మిక, వర్తక సంఘాల ప్రతినిధులు, బార్ అషోషియేషన్ సభ్యులు, మహిళలు ఆయన దీక్షకు మద్దతు తెలియజేశారు.

ఇదీ చదవండి:

ఏ1,ఏ2 ప్లాన్​ను ఉత్తరాంధ్రులు తిప్పికొడతారు: నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.