ఇదీ చదవండి :
రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత : తెదేపా - రుణమాఫీ రద్దు వార్తలు
రైతు రుణమాఫీ జీవో రద్దుతో రైతులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని తెదేపా నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కార్యకర్తలు విశాఖ కలెక్టరేట్ ముందు రైతులకు మద్దతుగా నిరసన తెలిపారు.
Tdp letter on runamafhi
రైతు రుణమాఫీ జీవో రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జీవో రద్దు పత్రాలను ప్రదర్శిస్తూ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీవో రద్దు కారణంగా రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్ధితి ప్రభుత్వం తీసుకొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, తెదేపా నేత రామానాయుడు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :
Intro:Body:Conclusion: