వైకాపా నిర్వహించిన సర్వేలో ఇల్లు లేని పేదలు విశాఖ జిల్లా అనకాపల్లిలో వేలలో ఉన్నారని... వాళ్లకే టిడ్కో భవనాలు కేటాయించాలని ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వర రావు డిమాండ్ చేశారు. స్థానిక పేదలకు టిడ్కో ఇళ్లు అందజేయాలని కోరుతూ... లబ్దిదారులతో కలసి తెదేపా నాయకులు అనకాపల్లిలో నాలుగు రోజులుగా చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. స్థానికంగా ఇల్లు లేని నిరుపేదలు ఎంతో మంది ఉండగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలకు ఇక్కడ నిర్మించిన టిడ్కో భవనాలు ఇవ్వడం దారుణం అన్నారు.
స్థానికులకే టిడ్కో ఇల్లు ఇస్తామని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రకటనతో నిరసన దీక్ష విరమిస్తున్నామని... ఇచ్చిన హామీని ఎమ్మెల్యే నిలబెట్టుకోవాలని సూచించారు.